![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -171 లో... శైలుని తన వాళ్ళు టార్చర్ చేస్తున్నారని పోలీసులకి ఫోన్ చేస్తుంది. దాంతో పోలీసులు ఇంటికి వస్తారు. ఇక శైలుపై చిన్న గీత పడినా తనకి కారణం మేమే అని సురేష్ తో ఒక పేపర్ పై రాయిస్తారు. దానిపై ముగ్గురు సంతకం చేస్తారు. ఇంకేమైనా ప్రాబ్లమ్ అయితే మళ్ళీ కాల్ చెయ్యమని శైలుతో పోలీసులు చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కేశవ దగ్గరికి శైలు వస్తుంది. నేను వచ్చాక నిన్ను ఏమైనా అన్నారా అని శైలుని కేశవ అడుగుతాడు.
దాంతో శైలు జరిగింది మొత్తం చెప్తుంది. ఐ లవ్ యు అని కేశవ చెప్తాడు. ఆ తర్వాత అందరు ఇంట్లో భోజనం చేస్తారు. పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందోనని మాధవ అనగానే తను చేసిన పని తెలిస్తే అందరు నవ్వుకుంటారని కేశవ జరిగింది చెప్తాడు. దాంతో నారాయణ నవ్వుతాడు. అసలు ఎందుకు నవుతున్నారని కేశవ అంటాడు. పాపం ఆ అమ్మాయిని చేసుకున్నాక వాడి పరిస్థితి ఏంటో అని నారాయణ అంటాడు. ఆ అమ్మాయికి మీరు చాలా ఇష్టం అసలు వదులుకోకండి అని మహా అనగానే అలా ఎలా వదులుకుంటారు అండి.. నేను ఎంత కష్టం అయినా మిమ్మల్ని వదులుకుంటున్నానా అని చక్రి అంటాడు. అయ్యో నోరు అసలు ఊరుకోదని అనుకొని చక్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు నారాయణ దగ్గరికి మహా వెళ్లి తిడుతుంది. అసలు మీకు బాధ్యత అనేది లేదా ఇంట్లో పెద్ద కొడుకుకి పెళ్లి చెయ్యాలని ఆలోచన లేదా అని కోప్పడుతుంది. అదే విషయం గురించి ఇంట్లోకి వచ్చి కేశవ, చక్రి కన్నా పై కోప్పడుతుంది మహా. సంబంధం చూస్తామని కేశవ చెప్తాడు. ఆ తర్వాత కేశవ, చక్రి బయటకి వెళ్తారు. అక్కడ మాధవ కూరగాయలు కొంటూ అక్కడ ఆడవాళ్లతో ముచ్చట్లు పెడుతాడు. అది కేశవ, చక్రి చూసి మాధవని పక్కకి తీసుకొని వచ్చి నువ్వు ఏంటి అన్నా వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నావ్.. ఎవరైనా చూసి ఏమనుకుంటారు.. ముదిరిన బెండకాయ అనుకుంటారని చక్రి అంటాడు.
నువ్వు ఇంకొకసారి అసలు కూరగాయలకి రాకు అని అక్కడ నుంచి మాధవని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత చక్రి, కేశవ ఇద్దరు ఒక దగ్గరికి వస్తారు. అక్కడ ఒక మ్యారేజ్ బ్రోకర్ తో మాట్లాడుతారు. మీ అన్నయ్యకి సంబంధం అంటే నా వల్ల కాదని అతను అంటాడు. తరువాయి భాగంలో మ్యారేజ్ బ్రోకర్ మాధవ కోసం ఒక సంబంధం తీసుకొని వస్తాడు. పంతులు మాధవ జాతకం చూసి ఈ అబ్బాయి ఈ ఇంట్లో ఉన్నంతవరకు పెళ్లి జరగదు.. ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరు అని పంతులు చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |